ఒక రియాల్టీ షోను హోస్ట్ చేసి బుల్లితెర టాప్ స్టార్ గా మారిపోవాలి అని ప్రయత్నించిన యాంకర్ ప్రదీప్ ప్రయత్నాల వల్ల ‘స్టార్ మా’ యాజమాన్యానికి 60 కోట్లు నష్టం రావడం హాట్ టాపిక్ గా మారింది. ‘పెళ్లి చూపులు’ షో ద్వారా సంచలనాలు సృష్టించి ప్రదీప్ కు ఉన్న క్రేజ్ రీత్యా భారీ రేటింగ్స్ పెంచుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.

యాంకర్ ప్రదీప్ సుమలకు ఉన్న క్రేజ్‌తో ఈజీగా రేటింగ్స్ పెంచేసుకోవచ్చని భావించిన స్టార్ మా యాజమాన్యం అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్నట్లుగా అయి ఈ షో ఘోర పరాజయం చెందింది ‘పెళ్లి చూపుల’ కోసం ఆ షో యాజమాన్యం ఎంచుకున్న అమ్మాయిల వల్గారిటీని చూసిన ప్రేక్షకులు ఈ షోపై ఆదిలోనే పెదవి విరిచారు. షోను ఆపేయండంటూ ఎందరో తమ సందేశాల ద్వారా షో యాజమాన్యానికి విన్నవించారు.

మధ్యమధ్యలో అనసూయ వంటి సెలబ్రిటీలను గెస్ట్‌లుగా షోకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ షో కోసం పనిచేసినందుకు యాంకర్ సుమ ప్రదీప్‌లపై కూడా విమర్శలు విపరీతంగా వచ్చాయి. రోజులు గడుస్తున్న కొద్దీ షో రేటింగ్స్ పూర్తిగా పడిపోవడంతో ‘స్టార్ మా’ యాజమాన్యం తమకు ఇప్పటికే వచ్చిన 60 కోట్ల నష్టం భరించలేక ఈ షోను ఆపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈషో నిర్వాహణా ఖర్చులు భరించలేక ఈ షోకు సంబంధించిన పూర్తి షూటింగ్ ను పూర్తి చేసి మూడు రోజుల క్రితమే ఈషోలో పాల్గొంటున్న అమ్మాయిలు అందరితో బయట ఎక్కడా కూడా షో పూర్తయ్యేవరకూ ఫోకస్ అవ్వకూడదంటూ సంతకాలు తీసుకుని సెట్ నుంచి పంపించేసినట్టు సమాచారం. దీనితో బుల్లి తెర టాప్ స్టార్ గా మారాలి అని ప్రయత్నిస్తున్న ప్రదీప్ ఎత్తుగడలు ఆదిలోనే ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది..

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments