పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా ఏడో రోజూ తగ్గాయి. బుధవారం దిల్లీలో లీటరు పెట్రోలు ధర 9 పైసలు తగ్గి రూ.81.25 కు చేరగా.. ముంబయిలో 8 పైసలు తగ్గి రూ.86.73గా ఉంది. డీజిల్‌ ధరల్లో మార్పేమీ లేకపోవడంతో అన్ని చోట్ల మంగళవారం నాటి ధరలే కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు పది పైసలు తగ్గి.. రూ.86.13కు చేరింది. కొద్ది నెలలుగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్నందున ఈ నెల 4న కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.2.50 తగ్గిస్తూ ఊరట కలిగించిన విషయం తెలిసిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments