దివంగత ముఖ్యమంత్రి జయలలిత నూతన విగ్రహాన్ని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో 28వ తేదీన ఆవిష్కరించనున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అన్నా యూనియన్‌కు చెందిన 107 మంది కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తదితరులు పాల్గొని ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మంత్రి తంగమణి, మాజీ మంత్రి కేపీ మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. త్వరలో 18 మంది అనర్హత ఎమ్మెల్యేలు కేసులో తీర్పు రానున్న నేపథ్యంలో అనుకూలంగా వస్తే ఏమి చేయాలి, ప్రతికూలంగా వస్తే తీసుకోవాల్సిన తదుపరి చర్యల గురించి చర్చించారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న జయలలిత విగ్రహానికి బదులు కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సమాలోచన నిర్వహించారు.