హర్యానాలోని భివానీలో పర్యటిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్యానా సీఎంను బలహీన ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో స్కూళ్లను, ఆసుపత్రులను చక్కదిద్దినప్పుడు హర్యానాలో అది ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా, ఆప్ నేత జైహింద్ తదితరులు భివానీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. బాపోడా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయన చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను, ఆసుపత్రులను మెరుగుపరిచామని అన్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే హర్యానా సీఎం నిజాయితీపై అనుమానాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments