గీతా ప్రెస్‌ గోరఖ్‌పూర్‌ తెలుగుభాష తాత్పర్యంతో ముద్రించిన వ్యాస రచిత సంపూర్ణ మహాభారతము గ్రంధాలను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో మంగళవారం ఆవిష్కరించారు. లక్ష శ్లోకాలతో, 18 పర్వాలు, 100 ఉప పర్వాలతో కూడిన సంపూర్ణ మహాభారతానికి సరళమైన తెలుగు తాత్పర్యంతో ఏడు గ్రంధాలలో ముద్రించడం అభినందనీయమని గవర్నర్‌ అన్నారు. విశేష వ్యాఖ్యానం జోడిస్తూ కవిత్రయం అనువదించిన మహాభారతంలోని వివరాలను జోడిస్తూ 14 మంది మహాపండితులచే తెలుగులో అనువదించి పరిష్కరించి అందించిన గీతా ప్రెస్‌ను గవర్నర్‌ అభినందించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments