బిగ్ బాస్ లో ఇక అందరూ ఊహించినట్టే రోల్ రైడా ఈవారం హౌస్ నుంచి వెళ్ళిపోతున్నాడు. బుల్లితెర రియాల్టీ షోలకే కొత్త అర్ధం చెప్పిన బిగ్ బాస్ షో లో సీజన్ టు చివరి దశలో నడుస్తోంది. క్లైమాక్స్ చేరడంతో ఈ ఒక్కవారం మిగులుతుంది. ఇప్పటికే హౌస్ మేట్స్ సపోర్ట్ తో ఫైనల్స్ కి సామ్రాట్ చేరాడు. ఇక ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేదెవరో,ఫైనల్స్ కి చేరేదెవరో అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ మొదలై 100 రోజులు అయినా ఎవరూ హౌస్ లో రూల్స్ సరిగ్గా పాటించడం లేదంటూ అందరినీ నామినేషన్ లో చేర్చాడు బిగ్ బాస్. అయితే ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి సామ్రాట్, రోల్ లకే తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా సామ్రాట్ ఫైనల్స్ చేరిపోవడంతో ఈ వారం ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాడు. దీంతో రోల్ బయటకు వచ్చేసాడు.

అయితే రోల్ ఎందుకు ఎలిమినేషన్ అయ్యాడంటే,తన గొయ్యి తానే తవ్వుకున్నాడని అంటున్నారు. షో ప్రారంభం నుంచి సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన రోల్ కేవలం హౌస్ మేట్స్ సపోర్ట్ కోసం తాపత్రయ పడ్డాడే తప్ప, ఆడియన్స్ లోకి ఎలా వెళుతోందో తెలుసుకోలేక పోయాడు. ఎక్కువసార్లు నామినేషన్ కి రాకపోవడం కూడా దీనికి తోడైంది. ఎగ్స్ టాస్క్ లో కౌశల్ మినహా మరెవ్వరూ రోల్ కి సపోర్ట్ చేయలేదు. దీంతో సామ్రాట్ అనూహ్యంగా ఫైనల్ కి వచ్చేసాడు.

అసలు విషయానికి వస్తే ,సామ్రాట్ రెండు సార్లు మాత్రమే నామినేషన్ లోకి వచ్చి,తక్కువ ఓట్లతోనే గట్టెక్కాడు. అందుకే సామ్రాట్ ఫైనల్ కి వెళ్లకుండా రోల్ అడ్డుకుని ఉంటే, రోల్ కి ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆడియన్స్ అంటున్నారు. ఇక అందరూ కుక్కల్లా పడుతున్నారని కౌశల్ అంటే, దానికి రోల్ వీరలెవెల్లో రెచ్చిపోయాడు. దీంతో ఈ అంశం కూడా రోల్ కి శాపంగా మారిందని అంటున్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments