దీప్తికి నకిలీ ఓట్లు.. కౌశల్ ఆర్మీ తీవ్ర ఆరోపణలు !

1458

‘బిగ్‌ బాస్ 2’ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో ఈషో విన్నర్ గా కౌశల్ ను చేయాలని కౌశల్ ఆర్మీ చేస్తున్న ప్రయత్నాలు మరింత వేగం పుంజుకున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో కౌశల్ ఆర్మీ దీప్తిని టార్గెట్ చేస్తూ చేస్తున్న నెగిటివ్ ప్రచారం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.

‘బిగ్‌ బాస్’ షోలో కంటెస్టెంట్ దీప్తికి నకిలీ ఓటింగ్ జరుగుతోంది అని కౌశల్ ఆర్మీ అభిప్రాయం. బయట పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా కొద్ది వారాలుగా ఆమె ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగిందనీ ఒక డిజిటల్ మీడియా కంపెనీ సహకారంతో సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు, జీమెయిల్ ద్వారా ఓట్లు వేస్తున్నారని కౌశల్ ఆర్మీ ఆరోపణలు.

కౌశల్‌ ఆర్మీ చేస్తున్న ప్రచారం ప్రకారం ఈవారంలో మంగళవారం ఉదయానికి 80వేల ఓట్లు పోల్ దీప్తికి పదుల్లో మాత్రమే ఓట్లు పోల్ అయ్యాయనీ అయితే ఆతరువాత భారీగా ఓటింగ్ పెరిగి దీప్తికి ఓట్లు పెరగడం వెనుక కారణం నకిలీ అకౌంట్లు అని అంటూ కౌశల్ ఆర్మీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వాస్తవానికి కౌశల్ కు సమఉజ్జీగా పోటీ పడుతున్నది గీతా మాధురి అయితే మధ్యలో దీప్తి టార్గెట్ ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు కౌశల్ ఆర్మీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలున్న ప్రతీచోట కౌశల్ గురించి ప్రచారం చేస్తూ ఒక సరికొత్త ట్రెండ్ కు తెర తీస్తున్నారు. అమెరికా ఆస్ట్రేలియా న్యూజీలాండ్ లలోని అనేకమంది కౌశల్ అభిమానులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి కౌశల్ కోసం అత్యంత భారీ స్థాయిలో ఓట్లు వేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు కౌశల్ ను ‘బిగ్ బాస్ 2’ విన్నర్ గా చేయకూడదని ఎంతోమంది ప్రయత్నిస్తున్న నేపధ్యంలో కౌశల్ ఆర్మీ అనుసరిస్తున్న వ్యూహాలు బుల్లితెర రియాలిటీ చరిత్రలో ఒకసరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here