బిగ్ బాస్ ఫైనల్ కి గెస్ట్ గా తారక్

689

విదేశాల్లో పుట్టిన బిగ్ బాస్ రియాల్టీ షో మనదేశంలో ఎంట్రీ ఇచ్చి, హిందీలో 10 సీజన్లు పూర్తిచేసుకుని ఉత్తరాదిన ఓ ఊపు ఊపేసింది. అయితే ఆతర్వాత ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయా ప్రాంతాల నేటివిటీకి దగ్గరగా డిజైన్ చేస్తే సక్సెస్ ఉంటుందని తెలుగులో బిగ్ బాస్ నిరూపించింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ వన్ జనంలోకి దూసుకుపోయింది. విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.నిజానికి తెలుగులో సీరియల్స్ కి అలవాటు పడిన మహిళా లోకం ఇలాంటి రియాల్టీ షోలు ఏమాత్రం చూడబోరని, ఎందుకంటే ఇలాంటి షోలు అసభ్యంగా ఉంటాయని, కంటెంట్ లో మసాలా ఉంటుందని షో ప్రారంభం కాకముందు రారాకారకాల ఊహాగానాలు వచ్చాయి.

అయితే స్టార్ మా యాజమాన్యం జూనియర్ ఎన్టీఆర్ ని హోస్ట్ గా ప్రకటించి షో మొదలు పెట్టడంతో విపరీతమైన క్రేజ్ పరుచుకుంది. అసలు బిగ్ బాస్ అంటే తెలియని వారు సైతం తారక్ కోసం ఈ షో చూడడం మొదలుపెట్టారు. ఆవిధంగా సీజన్ వన్ కి తారక్ మంచి క్రేజ్ తెచ్చాడు.
ఇక సీజన్ టు లో మాత్రం జూనియర్ బిజీ వలన హోస్ట్ గా రాలేకపోయాడు.

అయితే హీరో నాని హోస్ట్ గా ఎంటరయ్యాక కొద్దిరోజులు ఇబ్బందిగా నడిచినా ఆ తర్వాత పట్టాలెక్కింది. ఇక కంటెస్టెంట్స్ కూడా పక్కాగా దొరకడంతో సీజన్ టు మంచి సక్సెస్ రేటు సాధించింది. సీజన్ టులో కౌశల్ మానియా ఓ ఊపు ఊపేస్తోంది. ఈ సీజన్ ముగిసే గడువు దగ్గర పడుతోంది. ఆతర్వాత మరో సీజన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఎన్ని సీజన్స్ వచ్చినా బిగ్ బాస్ తో తారక్ అనుబంధం మాత్రం పదిలమే.

అందుకే సీజన్ టుకి గెస్ట్ గా తీసుకురావాలని షో నిర్వాహకులు నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి బిగ్ బాస్ సీజన్ 2 మొదలయి నప్పటినుంచీ, ఏదో ఒక ఎపిసోడ్ కి తారక్ వస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో షో నిర్వాహకుల నిర్ణయం అభిమానులకు ఆనందం పంచుతోంది. అయితే తండ్రి మరణంతో విచారంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రతిపాదనను పెండింగ్ లో పెట్టాడట. ఢీ డాన్స్ షో ఫైనల్స్ కి తారక్ వెళ్లడంతో భారీగా రేటింగ్స్ వచ్చాయి. మరి బిగ్ బాస్ 2కి కూడా తారక్ వస్తే,ఆ మజాయే వేరు అంటున్నారు అభిమానులు.ఇక Prize Money విషయానికి వస్తే రకరకాల ఊహాగానాలు వస్తున్న సరైన క్లారిటీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here