ఇప్పుడు బిగ్ బాస్ అంటే కౌశల్‌, కౌశల్ అంటే బిగ్ బాస్ అన్న పరిస్థితులు వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఈయన తన ప్రవర్తనతో అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. బిగ్‌బాస్. ఏదైనా జరగొచ్చు అని హోస్ట్ నాని ముందే చెప్పారు. అన్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయేమో అనిపిస్తోంది. బిగ్ బాస్ ఫైనల్స్ కు దగ్గర పడుతున్న ఈ చివరి వారాల్లో హౌజ్ లో కంటెస్టంట్స్ మధ్య గొడవలు మరింత ముదురుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న సభ్యులందరికి కౌశల్ పూర్తిగా ఎగైనెస్ట్ గా మారాడు.

ప్రేక్షకుల్లో అతనికి చాలా ఆదరణ ఉంది. కానీ ఇంటిలో మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. నిన్న జరిగిన సంఘర్షణలో ఒకరు తరువాత ఒకరు కౌశల్ మీద మాటల దాడి చేయడం చూసాం. అయితే కౌశల్‌ను విలన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందా? అంటే ఔననే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అది హౌస్‌లో మాత్రం కాదండి వెండితెరపై.

ఎందుకంటే ఆయన కోసం కౌశల్ ఆర్మీ అనే గ్రూప్ ఏర్పడడం , వారు ర్యాలీలు, 2 కే రన్ లు చేపట్టడం చూస్తుంటే కౌశల్‌కి బిగ్ బాస్ టైటిల్ వచ్చినట్లే అని అందరూ పిక్స్ అయిపోయారు. అయితే మాస్ డైరెక్టర్ బోయపాటి శీను బాలయ్యతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇందులో కౌశల్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా, కౌశల్‌ని విలన్‌గా కాని లేదంటే కీలక పాత్ర కోసం ఎంపిక చేయాలని అనుకుంటున్నాడట. బోయపాటి కౌశల్‌ కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరిపాడట. ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఇదే టాపిక్‌పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మరి ఇందులో వాస్తవమెంత ఉందనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments