టీడీపీతో పొత్తును తప్పుపట్టిన విజయశాంతి

611

మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో పెట్టుకుంది. ఇప్పుడు ఆ పార్టీకి పోత్తుల వల్ల కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఆ పార్టీ నేతలే పొత్తును వ్యతిరేకిస్తున్నారు. టీడీపీతో పొత్తును కాంగ్రెస్ నేత విజయశాంతి తప్పుపట్టారు. విజయశాంతిని ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, శ్రీనివాసన్ కలిశారు. ఈ భేటీలో కాంగ్రెస్ ప్రచార కమిటీపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో పొత్తులపై ఈ సమావేశంలో సురీర్ఘంగా చర్చినట్లు వినికిడి. పార్టీలో మళ్లీ క్రియాశీల పాత్ర పోషించాలని ఆమెను నేతలు కోరినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు మహాకూటమి పేరుతో వివిధ పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here