పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతున్నారు. మూడో ఓవర్ తొలి బంతికే తొలి వికెట్ పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ వేసిన 2.1వ బంతిని ఇమామ్ ఉల్ హక్ (2; 7 బంతుల్లో) ఆడాడు. బ్యాట్ అంచుకు తాకిన బంతి కీపర్ ధోనీ చేతిలో పడింది. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ (0; 9 బంతుల్లో) సైతం భువి వేసిన 4.1వ బంతికి పెవిలియన్ చేరుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫకర్ జమాన్ వల్లే భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. పిచ్ సహకరించుకున్నా భువి, బుమ్రా కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తున్నారు. బాబర్ ఆజామ్ (1; 10 బంతుల్లో), షోయబ్ మాలిక్ (1; 4 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ 4/2తో నిలిచింది.
3కే 2 వికెట్లు.. జమాన్ డకౌట్
Subscribe
Login
0 Comments