ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలనుకున్నామని పార్టీ మనోగతాన్ని వెల్లడించారు. అయితే.. తెలుగు రాష్ట్రాలు కలిస్తే బలపడతాయని భావించిన బీజేపీ.. టీఆర్ఎస్, టీడీపీ కలవకుండా అడ్డుకుందని ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం తగువులు పెడుతోందని మండిపడ్డారు. టీడీపీని దెబ్బతీయడం, ఏపీకి అన్యాయం చేయడమే బీజేపీ ఉద్దేశం అని కేంద్రం తీరును దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
Subscribe
Login
0 Comments