బంపర్ అఫర్ కొట్టేసిన కౌశల్

729

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్రేజీ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. మరో రెండు వారాల్లో ముగియనున్న బిగ్ బాస్ చివరి అంకంలో ఉండడంతో ఇక విజేత ఎవరనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. కౌశల్,గీతామాధురి,తనీష్ లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ టైటిల్ కొట్టడం ఖాయమని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే షోషల్ మీడియాలో దూసుకుపుతున్న కౌశల్ ఆర్మీ బయట ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీంతో కౌశల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది . ఇక విన్నర్ గా కౌశల్ బయటకు రావడం ఖాయమని దాదాపు అందరి నోటా వినిపిస్తోంది.

సాధారణంగా బిగ్ బాస్ లో క్రేజ్ వచ్చాక, దాన్ని క్యాష్ చేసుకోవడం అందరికీ కుదరదు. మరికొందరు అయితే బయట ఛాన్సులు వచ్చినా సక్సెస్ సాధించలేక వెనుదిరిగిపోతారు. అయితే ప్రస్తుతం కౌశల్ వస్తున్న పాపులార్టీ చూస్తుంటే,సినీ ప్రముఖుల దృష్టి అతనిపై పడుతోంది. ఇప్పటికే అల్లు అరవింద్ కొన్ని చిత్రాలు కౌశల్ తో ప్లాన్ చేయాలనీ భావిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కన్ను కౌశల్ పై పడిందని అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా తీయబోతున్న బోయపాటి తర్వాత బాలకృష్ణతో మూవీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.

బాలయ్య తీసే సినిమాలో కౌశల్ ని విలన్ గా పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడట. లెజెండ్ మూవీతో జగపతి బాబు ని విలన్ గా చూపించి, అతని మార్కెట్ అమాంతం పెంచేసిన బోయపాటి సినిమా అంటే మాటలు కాదు.

బోయపాటి సినిమాలో కనుక కౌశల్ విలన్ గా వేస్తే, కౌశల్ రేంజ్ ఎక్కడికో వెళుతుందని అంటున్నారు. ఇప్పటికే సినిమాల్లో ఏదో చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టిన కౌశల్ ఇక ఇప్పుడు పెద్ద రేంజ్ కి చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here