ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలపై చర్చ జరుగనుంది. కృష్ణానది కరకట్టల నిర్మాణం, శ్రీకాకుళం రిమ్స్‌ వైద్యశాలలో పదవుల భర్తీ, కొండరాజులను గిరిజన తెగగా గుర్తించుట, రాష్ట్రంలో మితంవ్యయ గృహాల నిర్మాణంపై ప్రశ్నోత్తరాల్లో చర్చ జరుగనుంది. అలాగే ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌పైనా ప్రజాప్రతినిధులు చర్చించనున్నారు.

చివరి రోజు సమావేశాల్లో ప్రభుత్వం 14 బిల్లులను ప్రవేశపెట్టనుంది. సీపీఎస్‌పై వైఖరి తెలుపుతూ సభలో ప్రభుత్వం ప్రకటన చేయనుంది. అలాగే నదుల అనుసంధానం, సంక్షేమ రంగంపై అసెంబ్లీలో చర్చ కొనసాగనుంది. వైద్యారోగ్యంపైనా శాసనసభలో చర్చ జరుగనుంది. వీటితో పాటు గ్రామదర్శిని 1500 పనిదినాల అమలుపై, చంద్రన్న భీమా, యువ నేస్తంపై సభలో చర్చించనున్నారు.

శాసనమండలిలో…. ఈరోజు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీపై, జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలుపై, టీటీడీ ఆభరణాల ఆడిట్‌, తెలుగుభాష పునరుద్ధరణ, రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ, బాక్సైట్‌ గనుల తవ్వకం వంటి అంశాలు, వైద్య ప్రవేశాల్లో అడ్డంకులపై అత్యవసర ప్రజా ప్రయోజన నోటీసుపై ప్రధానంగా చర్చ జరుగనుంది. అలాగే ఈరోజు శాసనమండలిలో ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments