ఈ ఐదుగురిలో వెళ్లేదెవరు? ఉండేదెవరు?

936

నేచురల్ స్టార్ నాని హోస్ట్ వ్యహరిస్తున్న ‘బిగ్ బాస్2’ సీజన్ ఇప్పటికే 93 ఎపిసోడ్‌లు పూర్తి కావడంతో మరో 7 ఎపిసోడ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాలిటీలో ప్రస్తుతం 7 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. దీప్తి, గీతా మాధురి, తనీష్, కౌశల్, అమిత్, రోల్ రైడా, సామ్రాట్‌లు బిగ్ బాస్ టైటిల్‌ కోసం హోరా హోరీగా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో  జరిగిన ఎలిమినేషన్ నామినేషన్స్ కీలకంగా మారాయి.

ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఏడుగురులో ఐదుగురు నామినేట్ అయ్యారు. ఈవారం ఎలిమినేషన్‌లో కౌశల్, అమిత్, రోల్ రైడా, గీతా, దీప్తిలు ఉండటంతో వీరిలో ఇద్దరు బిగ్ బాస్ హౌస్‌ను వీడటం ఖాయంగా మారింది. ఇక కౌశల్‌కు గట్టి పోటీగా మారిన గీతా మాధురి ఈవారం ఎలిమినేషన్‌కి రావడంతో కౌశల్ ఆర్మీ ప్రభావం ఎంత వరకూ ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఇక గత వారం ఎలిమినేషన్ తప్పించుకున్న దీప్తి నల్లమోతు, అమిత్‌లు ఈసారి గట్టెక్కడం కష్టంగానే ఉంది. ఇక తొలి నుండి సేఫ్ గేమ్ ఆడుతూ ఫైనల్ ఎపిసోడ్స్ వరకూ నెట్టుకొచ్చిన రోల్ రైడాకు ఈ ఎలిమినేషన్ కీలకంగా మారింది.

కౌశల్‌కు ప్రేక్షకుల మద్ధతు భారీగా ఉండటం ఓట్లు శాతం ఆయనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక గీతా మాధురికి కూడా ఓట్లు శాతం బాగానే ఉంది. ఇక మిగిలిన దీప్తి, అమిత్, రోల్ రైడాలకే ప్రమాదం పొంచి ఉంది. వీరిలో దీప్తి నల్లమోతు కష్టం మీద ఈవారం ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నా.. అమిత్, రోల్ రైడాలకు ఈవారం ఎలిమినేషన్స్ ప్రాణసంకటంగా మారాయి. అయితే ఇది బిగ్ బాస్ ఏదైనా జరగొచ్చు అని మొదటి నుండి బిగ్ బాస్ ట్విస్ట్‌లు ఇస్తుండటంతో ఈ లెక్క అటు ఇటుగా మరే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here