రాష్ట్ర శాసనసభలో మెజారిటీ ఉన్నా అర్థంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముందో సీఎం కేసీఆర్‌ ప్రజలకు చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ప్రశ్నించారు. ముందస్తుపై విస్తృత ప్రచారం జరుగుతోందని, వరుస కేబినెట్‌  భేటీలు దీనికి సంకేతంగా కనిపిస్తున్నాయని బుధవారం పేర్కొన్నారు. ప్రభుత్వం 1.5 లక్ష కోట్ల అప్పులు తేవాల్సిన అవసరం ఏముందో వివరించాలన్నారు. రాష్ట్రంలో ఏటా 20వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ఉన్నా.. అప్పు ఎందుకు చేశారో తెలపాలన్నారు. నాలుగేళ్లకే ప్రభుత్వం రద్దు చేస్తే.. వచ్చే సారి రెండేళ్లకే రద్దు చేస్తారేమోనని పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments