గీతా మాధురి పై సంచలన కామెంట్స్ చేసిన నూతన్ నాయుడు..

797

ఇక తుది దశకు చేరుతున్న బిగ్ బాస్ సీజన్ 2 రియాల్టీ షో గురించి రకరాలుగా షోషల్ మీడియాలో కథనాలు వస్తూ,సంచలనం రేపుతుంటే, తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన నూతన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు మరింత సెన్షేషన్ అయ్యాయి. నూతన్ కి జరిగిన అన్యాయం కౌశల్ కి జరిగితే ఊరుకోబోమన్న కౌశల్ ఆర్మీ వ్యాఖ్యల నేపథ్యంలో దానికి బలం చేకూరేలా నూతన్ వ్యాఖ్యలు ఉండడం నిజంగా విశేషం. ఏదైనా జరగొచ్చు అనే ట్యాగ్ లైన్ తో సాగుతున్న బిగ్ బాస్ షోలో 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటాయని నాని శనివారం ప్రకటిచడం ద్వారా గణేష్ ని ఎలిమినేట్ చేసి, కౌశల్ ని సేఫ్ జోన్ లోకి పంపాడు.

సామ్రాట్,నూతన్, అమిత్ ఎలిమినేట్ లో వున్నారని, ఆదివారం విషయం ప్రకటిస్తామని చెప్పాడు. అయితే అమిత్ తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అవుతాడని అనుకుంటే, నూతన్ బయటకు రావాల్సి వచ్చింది. హౌస్ లో కౌశల్ తర్వాత గట్టి పోటీ దారైన గీతామాధురి గురించి బయటకు వచ్చిన నూతన్ మాట్లాడుతూ ‘గీతా స్టెప్ బై స్టెప్ ఆట ఆడుతుంది.

అయితే కౌశల్ ఆర్మీ టీమ్ గురించి తెలుసుకొని, అసూయ పడడం మొదలు పెట్టిందట. అప్పటినుంచి కౌశల్ తో పాటు, అతనికి సపోర్ట్ గా గల నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది”అని చెప్పుకొచ్చాడు.ఇక మొన్నటి కెప్టెన్సీ టాస్క్ లో కూడా నాకు కెప్టెన్సీ వస్తే, కౌశల్ కి అనుకూలంగా ఉంటానన్న ఉద్దేశ్యంతో కెప్టెన్సీ నుంచి తప్పకోమని అడిగింది.

ఇక ఆమె స్టాటజీ తెలియడం వలన ఆరోపణలు కూడా ఆమె గురించే రాసాను. బయట విషయాలు చెప్పనున్న కారణం చూపి, నాకు ఎక్కువ ఓట్లు వచ్చినా నన్ను ఎలిమినేట్ చేసేసారు. అదేపని శ్యామల చేస్తే ఎవరూ అడగలేదు. పైగా ఆమె గీతా గ్రూప్ లోనే వుంది. ఇక బిగ్ బాస్ యాజమాన్యం కూడా కౌశల్ ని ఇబ్బందుల పాలు చేయడానికి కష్టమైన టాస్క్ లు ఇచ్చి,బయటకు సాగనంపే అవకాశాలు కనిపిస్తున్నాయి’అని నూతన్ తన అనుమానం వ్యక్తపరిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here