గత వారం నూతన్‌ నాయుడు ఎలిమినేషన్‌ సరిగ్గా జరగలేదని, ఓట్లు ఎక్కవ వచ్చినా కావాలనే ఎలిమినేట్‌ చేశారని షో నిర్వాహకులు, హోస్ట్‌ నానిపై ప్రేక్షకులు మండి పడుతున్నారు. అంతా స్క్రిప్టెడ్‌ గేమ్‌ అని తనీష్‌ లేక గీతామాధురిల్లో ఒకరిని విజేతగా ప్రకటించడానికే బిగ్‌బాస్‌ ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

దీనిపై నాని స్పదించాడు. ఈ మేరకు నాని తాజాగా ఓ పోస్ట్‌ చేశారు. తనకు అందరూ సమానమే అంటూ ప్రకటన విడుదల చేశారు. ‘క్షమించండి.. మీలో కొంత మంది బాధపడ్డారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. షో చూస్తున్న మీరు మీ అభిమాన కంటెస్టెంట్‌ను ప్రత్యేకంగా ట్రీట్‌ చేస్తారు. కానీ నేను ఓ హోస్ట్‌గా అలా చేయలేను. అందరిని సమానంగా చూస్తాను. దీంతో మీరు నేను ఒకరికి వత్తాసు పలుకుతున్నానని అనుకుంటున్నారు. ఓ నటుడిగా, వ్యాఖ్యాతగా మీకు ది బెస్ట్‌ ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. ఈ విషయంలో నా ఆలోచనలు ఎప్పుడూ స్పష్టంగా ఉంటాయి.

నన్ను ద్వేషించినా, ప్రేమించినా.. మీరంతా నా కుటుంబ సభ్యులే. మీరు నన్ను అపార్థం చేసుకుంటే దాని ప్రభావం నాపై ఉంటుంది.. మీరైతే నన్ను కిందపడేయాలని చూడరు.

మీ ప్రేమను పొందేందుకు నా సాయశక్తుల ప్రయత్నిస్తా.- మీ నాని’ అని రాసుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here