తెలంగాణ ప్రభుత్వం రద్దుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్ కాసేపటి క్రితం గవర్నర్ను కలిసి సమర్పించారు. ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కేసీఆర్ను కోరారు. గవర్నర్ సూచనను సమ్మతించిన కేసీఆర్.. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగించేందుకు అంగీకరించారు. కేసీఆర్తో పాటు మంత్రివర్గ సభ్యులందరూ ఆపద్ధర్మంగా కొనసాగనున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్
Subscribe
Login
0 Comments