భారత మాజీ క్రికెటర్‌, టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే మరోసారి కోచ్‌ బాధ్యతలు అందుకోనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, ఈసారి బాధ్యతలు నిర్వహించేది టీమిండియాకు కాదు. ఐపీఎల్‌ జట్టైన దిల్లీ డేర్‌డెవిల్స్‌కి.

ఈ ఊహాగానాల గురించి దిల్లీ డేర్‌డెవిల్స్‌ యాజమాన్యం మాట్లాడుతూ…’టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లేతో సంప్రదింపులు జరుపుతున్నాం. వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహించాలని కుంబ్లేను కోరుతున్నాం. దీనిపై కుంబ్లే ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ కుంబ్లే మా జట్టులో కలిస్తే ఎంతో అదృష్టంగా భావిస్తాం’ అని వారు తెలిపారు. కుంబ్లేను మెంటార్‌గా ఎంచుకోవాలని భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి సౌరభ్‌ గంగూలీనే దిల్లీ డేర్‌డెవిల్స్‌ యాజమాన్యానికి సలహా ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా కుంబ్లే మెంటార్‌ బాధ్యతలు అందుకోవడానికి ఇష్టపడితే.. మరోసారి ఆసీస్‌ మాజీ సారథి రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేయనున్నాడు. గతంలో కుంబ్లే-రికీ పాంటింగ్‌ ముంబయి ఇండియన్స్‌ జట్టుకు కలిసి పని చేశారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రికీ పాంటింగ్‌ దిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది మార్చి 29 నుంచి మే 19 వరకు ఐపీఎల్‌ టోర్నీ జరగనున్నట్లు సమాచారం. జూన్‌లో ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌ కాస్త ముందుగానే నిర్వహించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments