నేచురల్ స్టార్ నాని-కింగ్ నాగార్జున లు కలిసి దేవదాస్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ నెల చివరినా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెట్ లో నాని తనయుడు జున్ను సందడి చేసాడు. ఏప్రిల్ 2న తొలిసారి తన కుమారుడిని అభిమానులకు పరిచయం చేసిన నాని ఆ తర్వాత కొద్ది సార్లు మాత్రమే తనయుడితో కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తాజాగా తన ముద్దుల కొడుకు అర్జున్ ( జున్ను) దేవదాస్ సెట్లోకి రావడంతో ఆయనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. గత పదేళ్ళుగా ఎవరి ముందు నటించడానికైన భయపడలేదు. ఇప్పుడు దాస్ సెట్‌కి జున్ను వచ్చాడు అనే కామెంట్ పెట్టాడు నాని. ఆయన పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. దేవదాస్ చిత్రంతో బిజీగా ఉన్న నాని మరోవైపు జర్సీ అనే చిత్రం కూడా చేస్తున్నాడు.
It’s been 10 years but I have never been so nervous to perform in front of someone 🙂
When Mr Junnu came to visit Dr Dasu on sets. pic.twitter.com/D07kt1hVUT
— Nani (@NameisNani) September 5, 2018