వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన… “ వైఎస్ జగన్‌కు ఈ మధ్య పెళ్లిళ్ల యావ ఎక్కువైంది. పవన్ నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్నారని వ్యక్తిగత విమర్శలు చేశారు. టీడీపీ నేతలపై పెళ్లిళ్ల భాష వాడి నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ తన స్వార్థం కోసం చేసుకున్న పెళ్ళిళ్లు ఎన్నో.. లెక్క ఉందా?. కేసుల నుంచి బయట పడేందుకు ఎవరితోనైనా కాపురం చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. జనసేనతో వైసీపీ పెళ్లి ఖాయమని వరప్రసాద్ చెప్తున్నారు. కేసులకు భయపడి మోదీతో జగన్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. జగన్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదు.. అక్రమ లావాదేవీల్లో పరిజ్ఞానం ఉంది“ అని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.