బిగ్ బాస్ సెకండ్ సీజన్ 10 వారాలు కంప్లీట్ చేసుకోగా ఈమధ్య ఆడియెన్స్ కూడా ఈ షోని బాగా చూస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతి వారం 10 కోట్లు తగ్గకుండా ఓట్లు వస్తున్నాయి అంటే బిగ్ బాస్ సెకండ్ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అయినట్టే. ఇక షోని సక్సెస్ ఫుల్ గా రన్ చేసేందుకు నిర్వాహకులు తెగ కష్టపడుతున్నారు.

ఈ క్రమంలో భాగంగా నిన్న హౌజ్ లోకి బుల్లితెర యాంకర్ అనసూయని సర్ ప్రైజ్ ఎంట్రీ ఇప్పించారు. గెస్ట్ గా అనసూయ సడెన్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే బిగ్ బాస్ హౌజ్ మెట్స్ అందరికి కళ్యాణ వైభోగమే టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులను రెండు భాగాలుగా చేసి వరుడు రాధాకృష్ణ వైపు కొందరిని.. వధువు మధుమతి వైపు మరికొందరిని విడగొట్టారు.

ఇక ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌజ్ లో గార్డెన్ ఏరియా మొత్తం కలర్ ఫుల్ గా తయారయ్యింది. ఇక మెహిందీ ఫంక్షన్ కు గెస్ట్ గా యాంకర్ అనసూయ అప్పుడే హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అనసూయ ఏం చెప్పింది.. హౌజ్ మెట్స్ గురించి ఎలా మాట్లాడింది అన్నది ఈరోజు ఎపిసోడ్ లో వస్తుంది. 10 వారాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్స్ లో ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. 4 వారాల్లో ఇద్దరు చొప్పున వెళ్తే ఫైనల్ గా 1 టైటిల్ విన్నర్ అవుతారు. మరి ఈ వారం నాని ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా అన్నది చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments