ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ లో గీతా మాధురి ప్రవర్తన సామ్రాట్ తో కాస్త తేడాగానే కన్పిస్తుంది. ఒకప్పుడు సామ్రాట్ తేజస్వితో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. అయితే తేజస్వి ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ 11 వ వారంలో ఉంది. మొన్న జరిగిన కాల్ సెంటర్ టాస్క్ సమయంలో గీతా మాధురి సామ్రాట్ వంక రొమాంటిక్ గా చూడటం, తన కళ్ళతో ఆకర్శించేటట్టు చేయటంతో పాటు సామ్రాట్ తో ఎక్కువగా పోట్లాడటం,సామ్రాట్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండటం వంటి విషయాలను బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు గమనించారు. అలాగే హౌస్ లో ఉన్న గీతా మాధురి స్నేహతులు శ్యామల,దీప్తి నల్లమోతు కూడా గమనించారు.

వెంటనే గీతాను గార్డెన్ ఏరియాకు తీసుకువెళ్లి గీతా చేస్తున్న,జరుగుతున్న మిస్టేక్స్ గురించి గీతకు వివరంగా చెప్పారు.సామ్రాట్ తో నీ తీరును మేము అర్ధం చేసుకుంటాం. నీవు ఏమిటో మాకు తెలుసు. చూసే ప్రేక్షకులు ఆలా అనుకొనే అవకాశం లేదు అంటూ శ్యామల కంటే ముందుగా దీప్తి అన్ని విషయాలను చెప్పింది.

శ్యామల గీతా మాధురితో నీవు సామ్రాట్ తో అంత క్లోజ్ గా ఉండకు. ఎందుకు చెప్పుతున్నానో అర్ధం చేసుకో అంటూ ఇద్దరు కలిపి గీతాకు ఒకరకంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా కాస్త గట్టిగానే చెప్పారు. అప్పుడు గీతా మాధురి నా మనస్సులో స్థానం నందుకి తప్ప ఎవరికీ లేదని చెప్పింది. తన స్నేహితురాళ్లకు మరియు బిగ బాస్ చూస్తున్న ప్రేక్షుకులకు అర్ధం అయ్యేలా చెప్పింది గీతా మాధురి.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments