ఎప్పుడెప్పుడా..! అని స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొబైల్‌ వచ్చేసింది. నోకియా బ్రాండ్‌పై మరో స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘నోకియా 6.1 ప్లస్‌’ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. గత నెలలో హాంకాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఫోన్‌ను గ్లోబల్‌ వెర్షన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన నోకియా ఫోన్ల మాదిరిగా కాకుండా 6.1 ప్లస్‌ డిజైన్‌ సరికొత్తగా ఉంది. యాపిల్‌ గతేడాది విడుదల చేసిన ఐఫోన్ x లా టాప్‌లో నాచ్‌తో పాటు ఫుల్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ను తయారుచేసింది హెచ్‌ఎండీ గ్లోబల్‌.నోకియా 6.1 ప్లస్‌ ధర రూ. 15,999గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌, నోకియా ఆన్‌లైన్ స్టోర్లలో ఆగస్టు 30 నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. నేటి నుంచే ప్రీఆర్డర్లు ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది.

హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా స్మార్ట్‌ఫోన్లను ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఎప్పటికప్పుడు గూగుల్‌ అందించే ప్రతి అప్‌డేట్‌ ఫోన్‌కు వస్తుంది. నోకియా 6.1 ప్లస్‌ ఫీచర్లు..*5.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే* స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌* 4 జీబీ ర్యామ్‌* 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, మెమొరీ కార్డు ద్వారా 400 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే సదుపాయం* ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌* వెనుకవైపు 16 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌తో రెండు కెమెరాలు* ముందువైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా* టైప్‌ సిపోర్ట్‌* 3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments