నాని కౌశల్ ఆర్మీకి భయపడుతున్నాడా ?

832

బిగ్ బాస్ రెండో సీజన్ మొదట్లో కాస్త స్లో గా నడిచిన రోజులు గడిచే కొద్ది ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. బిగ్ బాస్ రెండో సీజన్ పది వారాలు పూర్తి చేసుకుంది. గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాలో బిగ్ బాస్ ట్రేండింగ్ లో ఉంది. దీనికి కారణం కచ్చితంగా కౌశల్ ఆర్మీ అనే చెప్పాలి. ఒక కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కౌశల్ తన వ్యక్తిత్వంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోవింగ్ సంపాదించుకున్నాడు. షో చూస్తున్న కౌశల్ అభిమానులంతా ఒక్కటై ఆర్మీగా అవతరించి కౌశల్ కి సపోర్ట్ చేస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో ఒంటరి పోరాటం చేస్తున్న కౌశల్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వాళ్ళు ఎలిమినేట్ అయ్యేలా చేస్తున్నారు.

ఈ విషయాలేవీ కౌశల్ కి తెలియకపోయిన రీఎంట్రీ ద్వారా హౌస్ కి వెళ్లిన శ్యామలకి, షో హోస్ట్ చేస్తున్న నానికి కౌశల్ ఆర్మీ పవర్ ఏంటో తెలుసు. అందుకే ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినప్పుడుశ్యామల తనను సేవ్ చేసినందుకు తన అభిమానులతోపాటు మిగతా వాళ్ళ అభిమానులకు కృతజ్ఞతలు అని పరోక్షంగా కౌశల్ ఆర్మీకి థాంక్స్ చెప్పింది.

మరో వైపు నాని కూడా కౌశల్ ఆర్మీ ట్రోలింగ్స్ కి భయపడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. బాబు గోగినేని ఎలిమినేషన్ కి ముందు వారం నామినేషన్ లో ఉన్న వాళ్లలో నుంచి కౌశల్ పేరు కాకుండా బాబు గోగినేని సేవ్ అయ్యారని ముందు చెప్పడంతో కౌశల్ ఆర్మీ ట్రోల్స్ మొదలుపెట్టింది. ఎక్కువ ఓట్లు వచ్చిన కౌశల్ పేరు ముందు చెప్పకుండా బాబు గోగినేని పేరు చెప్పడమేంటని నానిని ట్రోల్స్ తో ముంచేశారు.

అయితే ఆ విషయంపై ఈవారం నాని క్లారిటీ ఇచ్చారు. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యారని ముందు ఒకరి పేరు చెప్పాను అంటే దాని అర్థం వాళ్లకు ఎక్కువ ఓట్లు వచ్చాయని కాదు. షోలో సస్పెన్స్ కోసమే అలా చెప్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అదీ కాక షోలో నాని కౌశల్ తో మాట్లాడే తీరులో కూడా మార్పు కనిపిస్తుంది. దీని బట్టి అర్థమవుతుంది బిగ్ బాస్ షోపై కౌశల్ ఆర్మీ ప్రభావం ఎంతగా ఉందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here