విజయవాడ తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇటీవల రాష్ట్రంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టిడిపి ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ చిరంజీవి చాలా మృదుస్వభావి అని వివాదరహితుడు అని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతో గొప్ప అభిమానులు కలిగిన చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 ఎన్నికల సమయంలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు…

అటువంటి గొప్ప వ్యక్తి మంచి నటుడు అయిన చిరంజీవి ఓడిపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏమాత్రం రాష్ట్రంలో ఉన్న ఓటర్ ని ప్రభావితం చేయలేరని పేర్కొన్నారు. ముఖ్యంగా తన అన్న చిరంజీవి తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ ఏమాత్రం రాజకీయాలకు పనికిరాడు అని పేర్కొన్నారు. పవన్ చుట్టూ ఎప్పుడు వివాదాలు ఉంటాయని అన్నారు. ఎంతో మంచి ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 సీట్లు మాత్రమే సంపాదించుకున్నారని అన్నారు.

ఈ క్రమంలో చిరంజీవి కన్నా తక్కువ ఫాలోయింగ్ ఉండి, పవన్ గెలుస్తారని ఎలా నమ్మగలమని ప్రశ్నించారు నాని. తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకోవాలనుకోలేదని, కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని, నారా లోకేష్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకొని కుటిల రాజకీయాలకు చేస్తున్నారని నాని అన్నారు. కనీస రాజకీయ పరిణితి లేక పవన్ కళ్యాణ్ తనకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారని..

అందుకే చంద్రబాబుపై విమర్శలు కురిపిస్తున్నారని నాని అన్నారు. పవన్ కేవలం మాటల మనిషి గాని చేతల కొచ్చేసరికి ఏమీ ఉండదని అన్నారు. ఒక గురి గమ్యం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతూ అభిమానులను ఆకట్టుకోవడమే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చేస్తున్నారని అన్నారు నాని.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments