‘గీత గోవిందం’ వసూళ్లు అదుర్స్! 2 మిలియన్‌ డాలర్ల వైపు పరుగులు.. హైదరాబాద్‌: ‘గీత గోవిందం’ సినిమా బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రం అమెరికాలో 1.5 మిలియన్‌ డాలర్ల వసూళ్లను అధిగమించి.. 2 మిలియన్‌ డాలర్ల వైపు పరుగులు తీస్తోందని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. అమెరికాలో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించిందని ప్రశంసించారు. ఈ చిత్రం మంగళవారం (ఆగస్టు 14న నిర్వహించిన ప్రీమియర్‌ షో) నుంచి గురువారం వరకు 731,490 డాలర్లు, శుక్రవారం 240,941 డాలర్లు, శనివారం 354,433 డాలర్లు, ఆదివారం 212,610 డాలర్లు మొత్తం 1,539,474 డాలర్లు (రూ.10.75 కోట్లు) రాబట్టిందని తరణ్‌ అన్నారు. అంతేకాదు ఆస్ట్రేలియా బాక్సాఫీసు వద్ద ‘గీత గోవిందం’ మొత్తం వసూళ్లు.. బాలీవుడ్ రెండు చిత్రాలు ‘గోల్డ్‌’, ‘సత్యమేవ జయతే’ కలెక్షన్స్ కంటే ఎక్కువని తెలిపారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. పరుశురాం దర్శకుడు. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు సినిమాను నిర్మించారు.

రష్మిక కథానాయిక. గోపీ సుందర్‌ బాణీలు అందించారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకోవడంతో పాటు ప్రముఖుల ప్రశంసలు పొందింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments