బిగ్ బాస్ రెండో సీజన్ లో బాబు గోగినేని గత ఆదివారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చారు. అయన ఒక టివి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా బాబు గోగినేని కౌశల్ ని టార్గెట్ చేసారు. అయితే తాను చేసింది టార్గెట్ కాదని నిరసన మాత్రమే అని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ రెండో సీజన్ కి విన్నర్ ఎవరు అవుతారని అడిగితె చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు బాబు గోగినేని. నాకు కౌశల్ పోటీ అని అనుకోలేదు. నాకు చివరి వరకు ఉండే సత్తా లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను. కౌశల్ ఫైనలిస్ట్ లో ఒకడిగా ఉంటాడని చెప్పారు.

ఈ విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. బయటకు వచ్చాక ఆయనకు ఉన్న సపోర్ట్ చూసాక ఇది నిజమే అని అనిపించింది. అలాగే నేను హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా హౌస్ లో కౌశల్ కి సపోర్ట్ కన్పించింది. హౌస్ లో ఆడవారితో ఒక టాస్క్ విషయంలో మీకు అన్యాయం జరిగిందని చెప్పితే మాకేమి అన్యాయం జరగలేదని కౌశల్ కి సపోర్ట్ గా మాట్లాడారు. దీన్ని బట్టి కౌశల్ కి హౌస్ లో కూడా సపోర్ట్ కనపడుతుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments