భారీ వరదలతో అస్తవ్యస్తమైన కేరళకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. తన తరఫున, పార్టీ తరఫున కేరళ వాసులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు కోటి రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి వైఎస్సార్‌సీపీ పంపనుంది.

భారీ వరదలు, ఎడతెగని వర్షాలతో ఛిన్నాభిన్నమైన కేరళ పరిస్థితిపై వైఎస్‌ జగన్‌ ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేరళ వరద విపత్తు హృదయాన్ని కలిచివేస్తోందని ఆయన శనివారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో తన ప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెంటే ఉంటాయని అన్నారు. విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here