ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ త్వరలో తన ఆత్మకథతో మనందరినీ పలకరించనున్నారు. తన మణికట్టు మాయాజాలంతో గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసిన వార్న్‌ తన ఆత్మకథకు పెట్టుకున్న పేరేంటో తెలుసా ‘నో స్పిన్‌’! ఈ అక్టోబర్‌ 4న ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. తన ఆత్మకథలో వార్న్‌ ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని వ్యక్తిగత వివరాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సత్యాసత్యాలు తెలియజేయనున్నాడు. గొప్ప క్రీడాకారుల ఆత్మకథల సరసన ‘నో స్పిన్‌’ నిలుస్తుందని పబ్లిషర్‌ ఈబరీ తెలిపింది. వార్న్‌ సేవలు లేకుండా క్రికెట్‌ను ఊహించలేమని, బ్రిటన్‌లోనూ అతను సెలెబ్రిటీ అని పేర్కొంది. వార్న్‌తో కలిసి టీవీ ప్రజెంటర్‌ మార్క్‌ నికోలస్‌ ఈ ఆత్మకథను రాశారు. ప్రపంచంలోని అత్యంత గొప్ప స్పిన్నర్లలో ఒకడిగా భావించే షేన్‌వార్న్‌ 1969, సెప్టెంబర్‌ 13న జన్మించారు. 1992లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు వన్డే, టెస్టుల్లో కలిపి 1000 వికెట్లకు పైగా పడగొట్టాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాట్స్‌మన్‌గా 3000 వరకు పరుగులు చేశాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments