భారత్‌ 270/3, కోహ్లీ 93 ట్రెంట్‌బ్రిడ్జ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ధాటిగా ఆడుతోంది. మూడో రోజు తేనీటి విరామానికి 3 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. 438 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సారథి విరాట్‌ కోహ్లీ (93; 182 బంతుల్లో 8×4) శతకానికి 7 పరుగులు దూరంలో ఉన్నాడు. ఆచితూచి ఆడుతున్నాడు. 90 పరుగుల వద్ద ఉండటంతో అతడిపై ఒత్తిడి పెంచేందుకు ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ను రంగంలోకి దించాడు. మరోవైపు అజింక్య రహానె (17; 48 బంతుల్లో 2×4) నిలకడగా ఆడుతున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం 46 పరుగులకు చేరింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments