విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన `గీతగోవిందం` సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా సత్తా చాటుతోందట.

ఆస్ట్రేలియాలో రెండు బాలీవుడ్ సినిమాలు కలిసి సాధించిన కలెక్షన్ల కంటే `గీతగోవిందం` సోలోగానే ఎక్కువ వసూళ్లు దక్కించుకుందట. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. `ఆస్ట్రేలియాలో `గోల్డ్‌`, `సత్యమేవ జయతే` వంటి బాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీనిస్తోంది ఏ సినిమాయో తెలుసా? విజయ్ దేవరకొండ నటించిన తెలుగు సినిమా `గీతగోవిందం`. రెండు హిందీ సినిమాలు కలిసి 1.92 లక్షల డాలర్లు సాధించగా.. `గీతగోవిందం` ఒక్కటే రెండు లక్షల డాలర్లను దాటేసింది` అని తరణ్ ట్వీట్ చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments