బిగ్ బాస్ రెండో సీజన్ లో అందరు ఊహించినట్టుగానే దీప్తి సునైనా ఎలిమినేట్ అయింది. గత వారం ఇచ్చిన కాల్ సెంటర్ టాస్క్ లో దీప్తి సునైనా కౌశల్ తో చాలా దురుసుగా మాట్లాడింది. కౌశల్ ని తీవ్రస్థాయిలో అసహనానికి గురి చేసే క్రమంలో గాడి తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. కౌశల్ ఎంత ఓపికగా ఉన్నా దీప్తి సునైనా మాత్రం పర్సనల్ ఎటాక్ చేసింది. దాంతో కౌశల్ అభిమానులు దీప్తిని ట్రోల్ చేయటం ప్రారంభించారు. ఆ ట్రోల్ చూసిన వారికి ఈ వారం ఎలిమినేటి అయ్యేది దీప్తి సునైనా అని అర్ధం అయింది. దీప్తి హౌస్ లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కౌశల్ తో SORRY బ్రో అంటూ ఎమోషన్ అయింది. కౌశల్ కూడా ఎగ్జిట్ వరకు తీసుకువెళ్లి సాగనింపాడు. ఇది చూసిన మిగతా హౌస్ మేట్స్ అందరూ ఆశ్చర్యపోయారు.

దీప్తి తనను దూషించిన సరే తనకు గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇచ్చాడు కౌశల్. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. కౌశల్ చాలా మంచి వాడని,గేమ్ లో భాగంగానే ఆలా ప్రవర్తించాల్సి వచ్చిందని,టాస్క్ లో ఎలాగైనా మాట్లాడవచ్చని రూల్ ఉందని, దానికి అనుగుణంగానే కౌశల్ ని రెచ్చకొట్టటానికి ప్రయత్నం చేసానే తప్ప వ్యక్తిగతంగా బాధించాలని కాదని చెప్పుకొచ్చింది.

కౌశల్ ఆర్మీ సంగతి బయటకు వచ్చాక తెలిసిందని ఎలిమినేట్ మీద దాని ప్రభావం చాలా ఉందని తెలిపింది. కౌశల్ తో వివాదం కారణంగానే నెగిటివ్ గా ప్రేక్షకులకు చేరిందని చెప్పింది. కౌశల్ చాలా మంచి వాడని,బిగ్ బాస్ టైటిల్ గెలిచే సత్తా ఉందని తెలిపింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments