తనీష్ ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

932

బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరుగొచ్చు..ఎవరైనా బయటకు వెళ్లొచ్చు.అన్నట్లే సాగుతుంది. నాని హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షో విజయవంతం గా 70 రోజులు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 2 మొదలైనప్పటి నుండి హౌస్ లో క్యూట్ క్యూట్ గా కనిపిస్తూ తన హావ భావాలతో అందర్నీ ఆకట్టుకుంటూ వస్తున్న దీప్తి సునయన ఈ వారం ఎలిమినేట్‌ అయి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది. అంతకు ముందు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో దీప్తి చాల బాగా చేసి అందర్నీ ఆకట్టుకుంది.

ఇక ఈ వారం దీప్తి సునయన ఎలిమినేట్‌ అయిందని వెంటనే హౌస్‌ నుంచి బయటకు రావాలని నాని చెప్పడం తో తనీష్ షాక్ అయ్యాడు. ఈ ప్రకటనతో తనీష్‌ ఒక్కసారిగా తనలోని బాధను బయటకు తీసాడు. కన్నీరు పెట్టుకుంటూ సునయన ఫై ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పాడు. తనీష్ ను ఆపడం ఎవరి వల్ల కాలేదు. హౌస్‌మేట్స్‌ అందరికి వీడ్కోలు చెపుతూ , తనీష్ ను చివరి హగ్ ఇచ్చి వెళ్ళింది.

వెళ్తూ వెళ్తూ.. రోజు ఉదయాన్నే పాట మొదలవగానే స్విమ్మింగ్‌ పూల్‌లో దూకి డ్యాన్స్‌ చేయాలనే బిగ్‌బాంబ్‌ను తనీష్‌పై వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here