కౌశల్ జోలికి వస్తే..అంతే..

681

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు 2 సీజన్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 70 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌజ్ నుంచి ఒక్కొక్కరూ ఎలిమినేషన్ అవుతున్న విషయం తెలిసిందే. ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కిరీటి, భానుశ్రీ, తేజస్వి, నందిని, బాబు గోగినేని నిన్న ఆదివారం ఎలిమినేట్ అయిన దీప్తి సునయనా..వీరందరూ బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్ కౌశల్ ని టార్గెట్ చేసినవారే కావడం విశేషం. ఇంట్లో మిగతా సభ్యులతో ఒకరకంగా..కేవలం కౌశల్ పై మాత్రం మరోరకంగా వ్యవహరిస్తూ వచ్చిన వీరందరూ ఎలిమినేట్ అయ్యారు.

దీని వెనుక కౌశల్ ఆర్మీ ఉందని..వారే నామినేషన్ లో ఉన్నవారు..ముఖ్యంగా కౌశల్ ని టార్గెట్ చేసిన వారిని మాత్రమే టార్గెట్ చేసి తక్కువ వొట్లు పడేలా చేసి ఎలిమినేష్ అయ్యేలా చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో అబద్దమెంతో తెలియదు కానీ..విచిత్రంగా కౌశల్ ని టార్గెట్ చేసిన వారే వెళ్లి పోతున్నారు. అయితే ఎలిమినేషన్ అయిన నూతన్ నాయుడు, యాంకర్ శ్యామల కూడా కౌశల్ ఆర్మీ ప్రభావంతోనే తిరిగి ఇంట్లోకి వచ్చారని కూడా టాక్ వినిపిస్తుంది.

కాకపోతే అనారోగ్యం కారణం చేత నూతన్ నాయుడు మళ్లీ హౌజ్ విడిచిపెట్టాల్సి వచ్చింది. ఏది ఏమైనా..బిగ్ బాస్ సీజన్ 2లో మిగిలిన విషయాల్లో ఏమైనా జరగొచ్చు కానీ.. కౌశల్ తో పెట్టుకున్నోళ్లు బిగ్ బాస్ హస్ నుంచి మాత్రం బయటకు వెళ్లిపోతారన్న సెంటిమెంట్ మాత్రం పక్కాగా వర్క్ వుట్ కావటం ఆసక్తికరంగా మారింది.

ఇక దీప్తి సునయనా మొదటి నుంచి కౌశల్ ని వ్యతిరేకిస్తూనే వస్తుంది..ఇది కాస్త మొన్నటి టెలిఫోన్ కాలర్ టాస్క్ లో శృతిమించిపోయింది. వయసు కు కూడా గౌరవం ఇవ్వకుండా దీప్తి తూ..నీ బతుకు అనే వ్యంగ పదాలు వాడుతూ..కౌశల్ ని మానసికంగా ఇబ్బంది పెట్టింది. దాంతో కౌశల్ ఆర్మీనే కాదు..నెటిజన్లు సైతం దీప్తి సునయనా పై కోపం తెచ్చుకున్నారు. దాంతో ఈ వారం ఎలిమినేషన్ లో ఆమె టార్గెట్ అయ్యింది. కౌశల్ తో పెట్టుకున్నోళ్లు ఎవరూ హౌస్ లో ఉండలేరన్న సెంటిమెంట్ కు మరింత బలం చేకూర్చినట్లు అయ్యిందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here