బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక బాబు గోగినేని సంచలనమైన కామెంట్స్ చేసారు. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ మరియు హోస్ట్ నాని మీద బాబు గోగినేని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వారి వెంట పడతారు మీడియా ప్రతినిధులు. వారితో మాట్లాడి హౌస్ లో అసలేమీ జరుగుతుందని ఒకటే ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తారు. అయితే బాబు గోగినేనికి ఈ ఇంటర్వ్యూలు ఏమి కొత్తేమి కాదు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్త వింతగా మాట్లాడారు. హోస్ట్ నాని మీద విమర్శలు గుప్పించారు. దీనికి కారణం హౌస్ లో ఉన్నప్పుడు బాబు గోగినేని రాజమోళిని విమర్శిస్తే కౌశల్ ఆలా మాట్లాడటం తప్పని వాదించారు .

వీకెండ్ లో ఈ విషయం గురించి నాని బాబు గోగినేనిని నిలదీశారు. దీనితో బాబు గోగినేని సారి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నాని హోస్ట్ నేను గెస్ట్ కాబట్టి అక్కడ సమాధానం చెప్పాల్సి వచ్చి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు నానిని ప్రశ్నించమని చెప్పండి. దానికి సమాధానం తప్పనిసరిగా చెపుతానని అంటూ నానికి కౌంటర్ వేశారు. నిజం ఎక్కడైనా ఒక్కటే కదా ఆ లాజిక్ మిస్ అయ్యారు బాబు గోగినేని.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments