జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో రెండో విడత ప్రజాపోరాట యాత్రలో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి తానే కారణమంటూ సంచలన కామెంట్ చేశారు.

అసలు గత సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని కానీ జనసేన పార్టీ ఎంటర్ అవడంవల్ల టిడిపి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని స్థానాలు కైవసం చేసుకుందని ఈ సందర్భంగా తెలియజేశారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా టిడిపి పార్టీ నాయకుడు ఎమ్మెల్యే పితాని నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు పవన్.

అంతేకాకుండా సినిమా హీరోలు రాజకీయాల్లో డైలాగులు చెబితే ఓట్లు రాలవని అన్న టిడిపి నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు పవన్. సినిమా అనేది వృత్తి, రాజకీయాలు బాధ్యతగా పేర్కొన్నారు.

రాష్ట్రాభివృద్ధికి అనుభవజ్ఞుడు అవసరమని టీడీపీకి మద్దతిచ్చామని, రాజకీయ నాయకులు మాటలు తప్పుతుంటే బాధ కలిగి ప్రజలకు అండగా వారి సమస్యలపై పోరాడటానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఇసుక దందాలు, భూ కబ్జాలు మీకు కనబడటం లేదా? అని పవన్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో పశ్చిమగోదావరి ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించ కూడదని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు పవన్.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments