స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొ నేందుకు ఇక్కడికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యే వారికోసం రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం కే ఉమామహేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నెంబర్‌ 07256 హైదరాబాద్‌ – నరసాపూర్‌ ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీన సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.42కి పిడుగురాళ్ల, అర్ధరాత్రి 12.15కి గుంటూరు, 1.20కి విజయవాడ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నరసాపూర్‌ చేరుకొంటుంది. నెంబర్‌ 07255 నరసాపూర్‌ – హైదరాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 15వ తేదీన రాత్రి 7.30 గంటలకు బయలుదేరి 11.05కి విజయవాడ, అర్ధరాత్రి 12.20కి గుంటూరు, 1.35కి పిడుగురాళ్ల మరుసటిరోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌, 6.50కి హైదరాబాద్‌ చేరుకొంటుంది.

నెంబర్‌ 07001 హైదరాబాద్‌ – కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు ఈ నెల 14, 17 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.55కి పిడుగురాళ్ల, 2.55కి గుంటూరు, మరుసటి రోజు ఉదయం 9.25కి కాకినాడ టౌన్‌కు చేరుకొంటుంది. నెంబర్‌ 07002 కాకినాడ టౌన్‌ – హైదరాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 15, 19 తేదీల్లో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 3.40కి గుంటూరు, 4.50కి పిడుగురాళ్ల, ఉదయం 9.25కి సికింద్రాబాద్‌, 10 గంటలకు హైదరాబాద్‌ చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, త్రీటైర్‌, 10 స్లీపర్‌క్లాస్‌ భోగీలుంటాయని సీనియర్‌ డీసీఎం తెలిపారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments