సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు 43 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనకు అభిమానుల నుండే కాక సినీ, రాజకీయ ప్రముఖుల నుండి కూడా బెస్ట్ విషెష్ అందుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ కు తనదయిన స్టయిల్ లో శుభాకాంక్షలు తెలిపి అభిమానులను ఆకట్టుకున్నాడు. ‘హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ అన్నా.. మీకు ఈ ఏడాది గొప్పగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ తెలిపాడు. అలాగే నాగబాబు, రకుల్ ప్రీతి సింగ్, అల్లరి నరేష్ మొదలగు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వారు ఎలా తెలిపారో ఇప్పుడు చూద్దాం.

ఎన్టీఆర్‌: హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ అన్నా.. మీకు ఈ ఏడాది గొప్పగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.

మోహన్‌లాల్‌: హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్‌ మహేశ్‌

నాగబాబు: పుట్టినరోజు శుభాకాంక్షలు మహేశ్‌. ‘మహర్షి’ సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌

కేటీఆర్: సూపర్‌స్టార్, నా ప్రియమైన స్నేహితుడు మహేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు.

సుశాంత్‌: వావ్‌.. ఫస్ట్‌లుక్‌లో ఫ్రెష్‌గా, ఛార్మింగ్‌గా కనిపిస్తున్నారు. ఈ హ్యాండ్సమ్‌ స్టూడెంట్‌కు హ్యాపీ బర్త్‌డే

మారుతి: మన సూపర్‌స్టార్‌ మహేశ్‌కు పుట్టినరోజు శుభాకంక్షలు. ‘మహర్షి’ లుక్‌ అదిరింది.

అల్లరి నరేశ్‌: ఈ ‘రవి’ నుంచి ‘రిషి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను సర్‌. ‘మహర్షి’ సినిమాలో నేనూ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదో మైలురాయి.

ఈషా రెబ్బా: టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో హ్యాండ్సమ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబుకు హ్యాపీ బర్త్‌డే.

గోపీచంద్‌ మలినేని: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘మహర్షి’ ఫస్ట్‌లుక్‌ అదిరింది.

అనిల్‌ రావిపూడి: అన్నా..ఫస్ట్‌లుక్‌ అదిరింది. హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ గారు.

రకుల్‌ ప్రీత్‌: హ్యాపీ బర్త్‌డే ఎవర్‌గ్రీన్‌ వన్‌ అండ్‌ ఓన్లీ మహేశ్‌ బాబు. బ్లాక్‌బస్టర్‌ సినిమాతో మీకు ఈ ఏడాది ప్రారంభం కావాలని ఆశిస్తున్నాను.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments