ఏపీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాత్రి 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. 10:30 గంటల లోపు ఫలితాలు వెల్లడించనున్నట్లు కార్మికశాఖ అధికారులు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీలో 50 వేల మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా ఎన్ఎంయూ, ఈయూ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. రెండేళ్లుగా గుర్తింపు యూనియన్‌గా ఉన్న ఎన్ఎంయూ ఒంటరిగా బరిలోకి దిగితే, ఇతర చిన్న యూనియన్లతో ఈయూ కూటమి కట్టింది. ఏపీలోని 128 డిపోల్లో పోలింగ్ జరుగుతుండగా, హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, బస్‌భవన్‌లో 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.