మళ్ళీ ఫిదా అంటున్న సాయి పల్లవి

667

ప్రేక్షకులను హోల్ షేల్ గా ఫిదా చేసేసింది సాయి పల్లవి. ఫిదా సినిమాలో భానుమతిగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సాయిపల్లవి ఇప్పుడు ఫుల్ బిజీ. ఐతే తనకు ఇంత క్రేజ్ తీసుకు వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ములతో మరోసారి పనిచేయడానికి రెడీ అవుతుంది సాయి పల్లవి.

‘ఫిదా తర్వాత తన తదుపరి సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు శేఖర్. ఈ చిత్రంలో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రంలో సాయిపల్లవిని హీరోయిన్‌గా నటింప చేయడానికి శేఖర్ కమ్ముల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆమెను కలిసి కథ కూడా వినిపించారట. సాయి పల్లవి కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

అక్టోబర్‌లో స్టార్ట్ కాబోయే ఈ సినిమాను శేఖర్ కమ్ముల తన స్వంత బ్యానర్‌లో నిర్మిస్తారని తెలుస్తుంది. ఇది శేఖర్ కమ్ముల మార్క్ కు భిన్నంగా వుండే కధని చెబుతున్నారు. అందుకే శేఖర్ కొత్త కుర్రాడుని ఎంచుకున్నారని భోగట్టా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here