తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి(94) నిన్న సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈయన మృతి పట్ల యావత్ తమిళ ప్రజలే కాదు తెలుగు రాజకీయ , సినీ ప్రముఖులు సైతం ఆయనకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా కరుణానిధి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

”తమిళ సినీ పరిశ్రమలో సినీ రచయితగా మొదలై ఐదు సార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రి గా గెలిచిన ఘనత మరియు చరిత్ర కరుణానిధిగారిది. డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఏభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న గొప్ప నాయకుడు ఆయన. తమిళ ప్రజలకు తమిళనాడుకు ఆయన చేసిన సేవలు మరియు తమిళ సాహిత్యానికి ఆయన అందించిన ప్రోత్సాహం తోడ్పాటు మరువలేనివి, మాటల్లో చెప్పలేనివి. అందుకే ఆయనంటే ఎంతో గౌరవం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని మనోజ్ ట్విట్ చేశారు.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here