నాని హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడం తో హౌస్ సభ్యులకు బిగ్ బాస్ కఠినమైన టాస్క్ లు విధించడం మొదలు పెట్టాడు. 58 వ రోజు బోనాల పండుగ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ సభ్యులకు ఇంటిని అందంగా పూలతో అలంకరించడం , మంచి వంట వాడుకొని , అందరు సంప్రదాయబద్దంగా ఉండాలని సూచించాడు. బిగ్ బాస్ చెప్పినట్లే అందరు కూడా ఎంతో అందంగా బిగ్ బాస్ హౌస్ ను అలంకరించారు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు.

గార్డెన్ ఏరియాలో ఉన్న టెంట్లోకి ఎవరు చివరికి చేరుకుంటారో వారి నామినేషన్ అయినట్టు బిగ్ బాస్ తెలిపాడు. పూజా రామచంద్రన్ కెప్టెన్‌గా ఉండడం, ఇటీవల కమల్ హాసన్ ఇంట్లోకి వచ్చినప్పుడు అమిత్‌కి సేవ్ కార్డ్ ఇవ్వడంతో ఈ ఇద్దరు టాస్క్‌కి మినహాయింపుగా ఉన్నారు. మొత్తం ఆరు రౌండ్ లలో సభ్యులు టెంట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో రౌండ్ లో ఎవరైతే చివర్లో ఉంటారో వారు నామినేషన్ లో ఉన్నట్లు.

మొదటి రౌండ్ లో బాబు గోగినేని చివరికి టెంట్‌లోకి వెళ్లడం తో ఆయన మొదటి నామినేషన్‌లో నిలిచారు. రెండోసారి గీతా , మూడోసారి గణేష్‌, నాలుగోసారి శ్యామల నిలిచారు. ఇక ఐదోసారి మాత్రం దీప్తి సునయన కోసం తనీష్ వెనుకడుగు వేసి నామినేషన్‌లో ఐదో వ్యక్తిగా ఉన్నాడు. వాస్తవానికి దీప్తి చివరకు వచ్చింది కానీ దీప్తి ని చూసిన తనీష్ తాను ఓ అడుగు వెనక్కు వేసి ఆమెను లోనికి పంపడం తో దీప్తి సేఫ్ అయ్యింది. ఆ తర్వాత శ్యామల తో తనీష్ , దీప్తి కోసం ఆలా చేసానని చెప్పినట్లు శ్యామల కౌశల్‌ తో చెప్పింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments