గత కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న శ్రీరెడ్డి.. తాజాగా కమెడియన్ పృధ్వీరాజ్‌పై సోషల్ మీడియాలో విరుచుకుపడింది. కొంత కాలాంగా సెలబ్రెటీలను టార్గెట్ చేసుకొని విమర్శలు చేసే నేపథ్యంలో శ్రీరెడ్డి నోటికి అదుపు ఉండడం లేదు. నిజంగా అన్యాయం జరిగి ఉంటే చట్టాల ద్వారా ప్రయత్నించవచ్చు. వారిపై ఆరోపణలు చేసి నిరూపించవచ్చు. కానీ శ్రీరెడ్డి ప్రముఖులపై చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

కాగా, ఇండస్ట్రీలో ఎవరైనా ఇబ్బందిపెడితే అప్పుడే మహిళా సంఘాలకి చెప్పి ఉండొచ్చు లేదా నిర్భయ చట్టం తెచ్చారు.. ఫిర్యాదు చేయొచ్చు కదా..? కానీ.. అప్పుడేమో సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు ప్రచారం కోసం మీడియా ముందుకు వస్తున్నారు అని శ్రీరెడ్డిని ఉద్దేశించి పృధ్వీ వ్యాఖ్యలు చేశాడు.పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఆలా దూషించడం నిజంగా దారుణం అని పృథ్వీ అన్నాడు.

నా దృష్టిలో శ్రీరెడ్డి అసలు ఆడదే కాదు. కనీసం ట్రాన్స్ జెండర్స్ కూడా లాంటి మాటలు మాట్లాడారు అన పృథ్వీ శ్రీరెడ్డిపై ఘాటు విమర్శలు చేశాడు. దీనిపై స్పందించిన తన ఫేస్ బుక్ పేజీలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పృథ్వీ గురించి కామెంట్స్ చేస్తూ.. బంజారా హిల్స్ రోడ్ నెం 10 లో నీ గోకుడు యవ్వారాల గురించి తెలియదా అంటూ ఆరోపణలు చేసింది.

ఇదే తరహా వ్యాఖ్యలు శ్రీరెడ్డి చాలా మంది సెలెబ్రిటీలపై చేసిన సంగతి తెలిసిందే.నీ భాగోతం గురించి అమెరికా ఈవెంట్స్ కి వచ్చిన అమ్మాయిలకు కూడా తెలుసు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. పృథ్వీని ముసలి నక్క అని సంభోదిస్తూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ ముసలి నక్కకు ఎమ్మెల్యే టికెట్ కావాలంట అంటూ ఎద్దవా చేసింది. గురువింద గింజ అక్కడ పెట్టుకో అంటూ పేర్కొనలేని పదజాలంతో శ్రీరెడ్డి బూతు కామెంట్స్ చేసింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments