• ‘యందిరన్‌’ కథ నాదే

2010లో దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ‘యందిరన్‌’ ఎంతటి ఘన విజయం సాధిం చిందో అందరికీ తెలిసిందే. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఐశ్వర్యరాయ్‌ జంటగా నటించిన ఆ చిత్రం అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్‌ రికార్డులన్నింటినీ బద్దలుకొట్టేసింది. అంతేకాదు, కథ, టెక్నాలజీ, గ్రాఫిక్స్‌ విషయంలో శంకర్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆరూర్‌ తమిళనాథన్‌ అనే రచయిత ‘యందిరన్‌’ కథ తనదని కేసు వేశారు. దీంతో శంకర్‌ కోర్టులో హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై శంకర్‌ కోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ వేశారు. అందులో.. ‘యందిరన్‌’ కథ తనేదనని, ఈ కథకి, ఆరూర్‌ తమిళనాథన్‌ చెబుతున్న కథకి సంబంధమే లేదని, రెండింటిలోను చాలా వ్యత్యాసాలు ఉన్నాయని శంకర్‌ పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments