సర్గీయ నందమూరి తారకరామారావుగారి జీవిత కథతో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. బాలక్రిష్ణ హీరోగా , నిర్మిస్తున్న ఈ చిత్రం ఫై యావత్ తెలుగు ప్రేక్షకులు , ప్రజలు ఎంతో ఆసక్తి గా ఉన్నారు. వారి ఆసక్తి తగ్గట్లే సినిమాను తెరకెక్కిస్తున్నారు క్రిష్. ఇక ఈ చిత్రంలో పలు ముఖ్యమైన పాత్రల కోసం ప్రముఖ నటి నటులను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానా, బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్, హరికృష్ణ పాత్ర కోసం కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరరావ్ పాత్ర కోసం సుమంత్ ను తీసుకోగా ఇక బాలకృష్ణ పాత్ర కోసం ఎన్టీఆర్ ను తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నాడట. ఎందుకంటే బాలకృష్ణ లోని రాజసం, ఆయనలా లెంగ్తీ డైలాగ్స్ చెప్పే నైపుణ్యం, బాడీలో ఎనర్జీ, డ్యాన్సుల్లో గ్రేస్ వంటి క్వాలిటీలన్నీ ఎన్టీఆర్ లో ఉంటాయి కాబట్టి ఆ పాత్ర కు ఆయనైతేనే న్యాయం చేస్తారని క్రిష్ భావిస్తున్నారట. మరి ఈ పాత్ర కు ఎన్టీఆర్ ఓకే చెపుతాడా..లేదా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here