నేచురల్ స్టార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ 2 రోజురోజుకు ఆసక్తి పెంచుతోంది. మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. వందరోజుల షో ఇప్పటికే 50రోజులు పూర్తి చేసుకొంది. మిగితా సగం డబుల్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగేలా ప్లాన్ చేసినట్టు శనివారం షోలో స్వయంగా నానినే తెలిపారు.

ఐతే, బిగ్ బాస్ ఇంటిలో ఉన్న కొందరు కంటెస్టెంట్లను మాత్రం కోర్టు కేసులు – న్యాయపరమైన చిక్కులు వెంటాడుతున్నాయి.బయట వారు గతంలో చేసిన పనులకు చట్టప్రకారం చర్యలకు గురవుతున్నారు. ఇప్పటికే సామ్రాట్ ను కన్ఫెషన్ రూంకు పిలిచిన బిగ్ బాస్ అతడికి కోర్టు నోటీసులు వచ్చాయని చెప్పారు. ఇందుకోసం సామ్రాట్ బిగ్ బాస్ ఇళ్లు వదిలి బయటకు వెళ్లాల్సి వస్తుందని కూడా తెలిపారు. సామ్రాట్-అతడి భార్య హర్షితరెడ్డి కి మధ్య గొడవలయ్యాయి. సామ్రాట్ పై వరకట్నం – హింసించినట్టు అతడి భార్య కేసు పెట్టింది.

హేతువాది – మానవతావాది బాబు గోగినేనిపై కూడా కేసులు నమోదయ్యాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బాబుపై ఆధార్ ను దుర్వినియోగం చేశాడని.. దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా ఆధార్ నంబర్లను తీసుకొని మలేషియా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సామాజిక కార్యకర్త శివ తాజాగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశాడు. నూతన్ తన తమ్ముడికి ప్రైవేటు యూనివర్సిటీ పెట్టిస్తానని.. ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పిస్తానని రూ.3కోట్లు తీసుకొని మోసం చేశాడని శివ ఆరోపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here