స్టార్‌మా ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షో.. ఎవ్వరిని ఎంత మేర రంజింపజేస్తోందో గాని.. స్టార్ కమెడియన్ ప్రిథ్విని మాత్రం మంటెక్కించేసింది. ప్రేక్షకుల విలువైన సమయాన్ని వృధా చేయడం తప్ప బిగ్‌బాస్‌తో ఒరిగే ఎంటర్‌టైన్మెంట్ ఏమీ లేదంటున్నారు పృథ్వి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అదొక బూతు కార్యక్రమమంటూ తిట్టిపోశారు కూడా. అసలా షో కాన్సెప్ట్‌లోనే తప్పుందన్నారు. ‘ఆడా మగా అందర్నీ ఒకచోట పడుకోబెట్టడం ఏమిటి? జరగరానిదేదైనా జరిగితే..?’ అంటూ ధర్మ సందేహం వెలిబుచ్చారు. అక్కడితో ఆగకుండా.. ‘నన్ను, పోసానిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద లోపలి పంపించి చూడండి.. ఎంటర్‌టైన్మెంట్ అంటే ఏమిటో చూపెడతాం..’ అంటూ తొడకొట్టేశారు. ఈ ఓపెన్ ఛాలెంజ్‌కి ‘బిగ్‌బాస్’ నిర్వాహకులు స్పందిస్తారో లేదో చూడాలి!

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments