రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ, రవాణా, కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్రంలో బంద్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికుల సమ్మెతో ఆర్టీసీ సిబ్బంది విధులకు హాజరు కాలేదు. వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాల కోసం పడిగాపులు కాస్తున్నారు.సరిపడా ప్రైవేటు వాహనాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.